DIGITAL MANCHERIAL NEWS:-
- నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరం: డీసీపీ భాస్కర్.
మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ శనివారం మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్‌తో పాటు నిరంతర పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీలు అత్యవసరమని ఆయన సూచించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. నమోదవుతున్న కేసుల వివరాలు, రౌడీషీటర్ల సమాచారం, కేసుల పురోగతిపై ఆరా తీశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గంజాయి, మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్, ఎస్‌ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

