DIGITAL MANCHERIAL NEWS:-
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీతో పాటే ఉద్యోగం.
- ఏఈడిపి కోర్సుల్లో జాయిన్ అయితే మొదటి రెండేళ్లే డిగ్రీ తరగతులు.
- చివరి సంవత్సరం స్కాలర్షిప్ తో కూడిన ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ.
- మీ లక్ష్యం ఉద్యోగమే అయితే సద్వినియోగం చేసుకోండి.
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్.
- ఎన్ని డిగ్రీలు చదివినా ఒక్క ఉద్యోగం కూడా రాని ప్రస్తుత పరిస్థితుల్లో... డిగ్రీ చదువు పూర్తికాకముందే ఉద్యోగానికి సంబంధించిన శిక్షణతో పాటు... ఇలా డిగ్రీ పూర్తికాగానే అలా ఉద్యోగాన్ని అందించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల.* ఇందుకు కారణం... కళాశాలలో అందిస్తున్న ఏఈడిపి డిగ్రీ కోర్సులే. అవును ఇది నిజం. ఇది నిజంగా నిజం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన అద్భుతం ఏఈడీపీ కోర్సులలో ఉంది. ఒకప్పుడు నగర ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉన్న ఏఈడిపి డిగ్రీ కోర్సులు ఇప్పుడు మన బెల్లంపల్లిలోనే లభిస్తుండడం విశేషం. ఈ ప్రాంత బడుగు, బలహీన, వెనుకబడిన, పేద విద్యార్థుల పాలిట వరం.
- అద్భుతమైన 5 కోర్సులు -
AEDP అంటే Apprenticeship Embedded Degree Programme. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రస్తుతం అద్భుతమైన ఐదు ఏఈడీపీ కోర్సులను అందిస్తోంది. అవి 1. బీఏ ఆనర్స్, 2. బీకాం బిఎఫ్ఎస్ఐ, 3. బీకాం ఈ-కామర్స్, 4. బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, 5. బీఎస్సీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్. ఈ కోర్సులు ఒక్కొక్కటి ఒక్కో అద్భుతంలా విద్యార్థుల పాలిట నిలుస్తున్నాయి.
1. బీఏ ఆనర్స్ లో ఆర్ట్స్ విద్యార్థులు ఒక సబ్జెక్టును మూడేళ్లపాటు చదివి అందులో నిష్ణాతులు కావచ్చు. ఇది భవిష్యత్తులో వారికి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలలో మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా బీఏ ఆనర్స్ కోర్సు ద్వారా UPSC - I.A.S., I.P.S, TGPSC - GROUP 1 వంటి ఉద్యోగాల సాధనలో ముందుండవచ్చు.
2. బీకాం BFSI 'బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్' అనే ఈ కోర్సు చదవడం ద్వారా కామర్స్ విద్యార్థులు త్వరితగతిన బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొదటి రెండు సంవత్సరాలు కళాశాలలో తరగతులు ఉంటాయి. చివరి సంవత్సరం సంబంధిత అంశంలో ఏడాది పాటు స్టైఫండ్ తో కూడిన శిక్షణ ఉంటుంది.
3. బీకాం ఈ-కామర్స్ ఈ కోర్సు చదివిన కామర్స్ విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు ఈ-కామర్స్ రంగంలో అద్భుతమైన త్వరిత ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులో కూడా మొదటి రెండేళ్లు మాత్రమే కళాశాలలో తరగతులు ఉంటాయి. చివరి ఏడాది స్టైఫండ్ తో కూడిన శిక్షణ ఉంటుంది.
4. బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్: బెల్లంపల్లి లాంటి ప్రాంతంలో ఇలాంటి కోర్సు రావడమే అత్యంత అరుదైన విషయం. విశేషం. లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఇదొక ప్రత్యేకమైన కోర్సు. ఫిషరీస్ కు మరియు ఆక్వా కల్చర్ కు సంబంధించిన ఈ కోర్సులో మొదటి రెండేళ్లు కళాశాలలో తరగతులు ఉంటాయి. చివరి ఏడాది స్టైఫెండ్ తో కూడిన శిక్షణ ఉంటుంది.
5. బీఎస్సీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్: హార్టికల్చర్ విభాగానికి మరియు లాండ్ స్కేపింగ్ విభాగానికి సంబంధించిన ఈ కోర్సు కూడా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఉపాధి అవకాశాలు కూడా బాగుంటాయి. ఈ కోర్సు కూడా రెండేళ్లు కళాశాలలో చదివి, చివరి ఏడాది స్టైఫండ్ తో కూడిన శిక్షణ పొందవలసి ఉంటుంది.
- విద్యార్థి ఉద్యోగానికి ప్రభుత్వ బాధ్యత -
- డిగ్రీ పూర్తి చేసిన చాలామంది విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేని పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏఈడీపి కోర్సులను డిగ్రీ స్థాయిల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కోర్సులలో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్ల పాటు ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తరగతులు నిర్వహించి, చివరి ఏడాది సంబంధిత వివిధ సంస్థలతో మమేకమై విద్యార్థులకు స్టైఫండ్ అందజేస్తూనే శిక్షణ కూడా ఇప్పించనుంది. డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం కూడా లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, సంబంధిత కళాశాలనే సంయుక్తంగా తీసుకుంటుంది. కాబట్టి ఈ కోర్సులలో చేరిన విద్యార్థులకు ఉద్యోగం కచ్చితంగా లభిస్తుంది. ఇది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అందిస్తున్న హామీ.
-బీకాం టాక్సేషన్ తో టాక్స్ కన్సల్టెంట్-
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత ఐదేళ్లుగా అందిస్తున్న బీకాం టాక్సేషన్ అనే ప్రత్యేక కోర్సుతో కూడా డిగ్రీ పూర్తి కాగానే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. బీకాం టాక్సేషన్ కోర్సు చేయడం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన వారు టాక్స్ కన్సల్టెంట్ గా విరివిగా అవకాశాలు పొందడానికి మార్గం ఉంటుంది. అందుకే ఈ కోర్సు గత ఐదేళ్లుగా ఈ కళాశాలలో ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం ఈ కోర్సు ద్వారా డిగ్రీ పట్టాతో విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)కు ప్రత్యామ్నాయంగా టాక్స్ కన్సల్టెంట్ జాబ్స్ లభ్యమవుతున్నాయి.
- సద్వినియోగం చేసుకోండి: ప్రిన్సిపాల్.
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అందిస్తున్న ఏఈడిపి కోర్సులలో చేరి ఈ ప్రాంత విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు. మునుపెన్నడూ లేనివిధంగా బెల్లంపల్లి ప్రాంతంలోనే లభిస్తున్న ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని సూచించారు. డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం సాధించి మంచి భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఈడీపీ కోర్సులతో పాటు BA, B.Com. CA, B.Com Taxation, Bsc MPC, BSC BZC కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9959269975 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

