ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఒక పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర శర్మ.చిన్న గుడులలో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించే అర్చకులను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం మండిపడ్డారు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలోని ఏ దేవాలయంలోనైనా ఆరాధన క్రమం ఒకటే ఉంటుందని, భగవంతుడికి సేవ చేసే అర్చకులలో చిన్న, పెద్ద అనే తారతమ్యాలు తీసుకురావడం సరికాదని హితవు పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 6,575 మంది ధూపదీప నైవేద్య అర్చకుల మనోభావాలను దెబ్బతీసిన ఉపేంద్ర శర్మ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పలేని పక్షాన జిల్లాలోని అర్చకులందరినీ సంఘటితం చేసి వేయి స్తంభాల గుడి వద్ద నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్చరించారు.

