మంచిర్యాల నియోజకవర్గం:- దండేపల్లి మండలంలోని కన్నెపల్లి, నంబాల, వెల్గనూర్ గ్రామాలలో గురువారం దసరా కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలు అందజేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళలు ఆడపడుచులాగా భావించి దసరా కానుకగా బతుకమ్మ చీరలు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, సీనియర్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



