బెల్లంపల్లి నియోజకవర్గం:- కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం కు వెళ్లే బ్రిడ్జికి గుంతలు పడి ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్థానిక గ్రామ సర్పంచికి చెప్పిన కూడా పట్టించుకోవడం లేదు... బ్రిడ్జికి ఇరువైపులా పిల్లర్స్ లేక ప్రజలు బ్రిడ్జి పై నుంచి వెళ్లాలంటే బైకులు జారివాగులో జారి పడతాయని భయపడుతున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... స్థానిక ఎంపీడీవో కి రెండు నెలల కిందట వినతిపత్రం ఇచ్చిన ఇప్పటివరకు పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్ స్పందించి త్వరగా మరమ్మతులు చేయించాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల ఈ సమస్య పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్. BJYM నాయకులు సూరం సంపత్ కుమార్, బర్ల శంకర్ నవీన్, బాకీ సురేష్, తులసి రామ్, రెడ్డి బాలరాజు, సిక్రం శ్రీనివాస్, ఎస్టీ మోర్చా మండల ప్రెసిడెంట్ గునువంతరావు. తదిత బిజెపి నాయకుడు పాల్గొన్నారు.



