సజావుగా సాగిన నేతకాని మాహార్ కుల సంఘాల ఆత్మీయ సదస్సు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు జాతి పెద్దలు, మేధావులు విద్యార్థి సంఘ దిశానిర్దేకులు, ప్రొఫెసర్ జాడి ముసలయ్య, రాష్ట్ర TSTWD చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ ఆధ్వర్యంలో నేతకాని మాహార్ కుల సంఘాల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మనందరి ప్రియతమ నాయకులు, విద్యార్థుల స్ఫూర్తి, TNMVS మార్గనిర్దేశకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డా బోర్లకుంట వెంకటేష్ నేత,  మరో ముఖ్యఅతిథి జాతి ముద్దుబిడ్డ, విద్యార్థి సంఘ శ్రేయోభిలాషులు, బెల్లంపల్లి శాసన సభ్యులు దుర్గం  చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతకాని కుల సంఘ భవనాన్ని హైదరాబాద్ కేంద్రంగా స్థల కేటాయింపు మరియు నూతన భవన నిర్మాణానికి సదస్సు లో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో గౌరవ ప్రజాప్రతినిధులు ఇరువురు జాతి నిర్ణయాన్ని స్వాగతిస్తూ త్వరలోనే మనం ప్రభుత్వాన్ని కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో TNMVS - రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత, TNMVS తెలంగాణ నేతకని మహర్ విద్యార్ధి సంఘం బెల్లంపల్లి మండలం అధ్యక్షులు దుర్గం భాను ప్రసాద్, కుల సంఘ పెద్దలు ఇతరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by