మంచిర్యాల జిల్లా:- మందమర్రి హైవే రోడ్డు మీద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మందమర్రి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు మేకల ప్రశాంత్, మేకల రాజు కుమార్ బైకు పైన మంచిర్యాల నుండి మందమర్రి కి వస్తుండగా మార్గ మధ్యలో బైక్ ని లారీ ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో మేకల ప్రశాంత్ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జుగా కాగా, ఇంకొకరి పాదం లారీ టైర్ల కిందపడి పూర్తిగా తెగి పోయింది. చూసిన స్థానికులు పోలీసులకు తెలియజేయగా స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని బాధితులను 108లో ఆసుపత్రికి తరలించారు.


