చెన్నూరు నియోజకవర్గం:- జైపూర్ మండలంలోని కిష్టంపేట మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు మల్ల మల్లారెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అలాగే ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, మల్లారెడ్డి మృతి టిఆర్ఎస్ పార్టీకి కి తీరనిలోటని తెలియజేశారు.

