మంచిర్యాల జిల్లా:- మందమర్రి మండలంలోని బొక్కల గుట్ట గ్రామ సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణం పరిశీలిస్తే, అధిక వేగం వల్లే ప్రమాదం జరిగిందని చూసిన స్థానికులు చెబుతున్నారు.



