మంచిర్యాల జిల్లా:- కాసిపేట మండలంలోని సోనాపూర్ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్తులు. రొట్టెపెల్లి,సోనాపూర్ గ్రామ పేద ప్రజలకు పెంచవలసిన రేషన్ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్ కు తరలింపునకు చేసే ప్రయత్నం చేస్తుండగా TS20T 4075 వాహనాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామ ప్రజలు తెలిపారు.

