బెల్లంపల్లి నియోజకవర్గం:- మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ ఆదేశానుసారం సోమవారం కాసిపేట బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా సూరం సంపత్ కుమార్ ను నియమించారు. బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ మరియు కాసిపేట మండలం ఇంచార్జ్ అటుకపురి రమేష్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.


