మంచిర్యాల జిల్లా:- భీమారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలానికి చెందిన సుందిల్ల రజిత (24) అనే వివాహిత ఈనెల 24న ఉదయం తన ఇద్దరు పిల్లలు మినీ (4), రిన్సి (01) లను తీసుకొని పుట్టింటికి శెట్ పల్లికి వెళ్తానని చెప్పి వెళ్లింది. ఐన ఇంకా ఇంటికి రాకపోవడంతో వారి తండ్రి పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 6281315676 కు సమాచారం అందించాలని కోరారు.

