బెల్లంపల్లి నియోజకవర్గం:- కాసిపేట మండలంలో 3 కోట్ల 2 లక్షల రూపాయల RMSA నిధులతో నూతనంగా నిర్మించిన ఆదర్శ పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ముఖ్యఅతిథిలుగా హాజరై భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీమతి పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ కూర రగోత్తం రెడ్డి, మంచిర్యాల జిల్లా శ్రీమతి భారతీ హోళీకెరీ. అనంతరం మండల లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ, వైస్ ఎంపీపీ విక్రమ్, జడ్పీటీసీ చంద్రయ్య, మండల TRS పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS, TRSY, TRSV నాయకులు, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా విద్యాధికారి గారు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




