ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ గా ఈ చలాన్.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవని మంచిర్యాల ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలను డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్. ఎన్ఫోర్స్ మెంట్ సిస్టంతో కనెక్ట్ చేశామని, ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే, వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమేటిక్ గా ఈ చాలన్ ద్వారా జరిమానాలు పడతాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by