మంచిర్యాల నియోజకవర్గం:- మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను మంగళవారం ఉదయం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పకుండా చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పెంట రాజయ్య, AMC ఛైర్మన్ పల్లె భూమేష్, మున్సిపల్ కమిషనర్, పట్టణ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


