మంచిర్యాల జిల్లా:- మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డు మహ్మద్ యూనస్ ను హత్య చేసిన ఇస్పతి రావు అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ప్రమోద్ రావు పూర్తి వివరాలు వెల్లడించారు. యూనస్ రెండు నెలల క్రితం అదృశ్యం కాగా కొమురం భీం జిల్లా తిర్యాణి మండలంలోని ఉల్లిపిట్ట గ్రామ శివారులోని అడవిలో హత్యకు గురయ్యాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు పేర్కొన్నారు.

