బెల్లంపల్లి నియోజకవర్గం:- నెన్నెల మండలంలోని గుడిపేట గ్రామంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామంలో మధ్యలో గల చెట్టు పై పిడుగు వేయడంతో ఒకేసారి మంటలు అంటుకొని చెట్టు పూర్తిగా కాలిపోయింది. చెట్టు చుట్టు పక్కల ఇండ్లు వుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై, ఇళ్లలో నుంచి ఒకేసారిగా బయటికి పరుగులు తీశారు.

