బెల్లంపల్లి నియోజకవర్గం:- నెన్నెల మండలంలోని కుశ్నేపల్లి గ్రామానికి చెందిన జమ్మిడి సాలక్కకి వారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షల TRS పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఎంతో అండగా అండగా ఉంటుందని, దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెన్నెల మండల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

