మంచిర్యాల జిల్లా:- లక్షట్టిపేట మండలంలోని కురుస్తున్న భారీ వర్షాలకు పిడుగుపడి యువకుడు మృతి. వివరాల్లోకి వెళితే...చందరం గ్రామానికి చెందిన కొమ్ము సతీష్(30) అనే వ్యక్తి పొలంలో కలుపు పనులు చేస్తుండగా పిడుగు పడటంతో యువకుడు అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక స్థలానికి అతనిని చూసి రోదిస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

