గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITALMANCHERIAL:- మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా గట్టుపల్ మండలం కమ్మగుడెం గ్రామంలో స్థానిక B(T)RS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలసి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, B(T)RS పార్టీ సంక్షేమ పథకాలను, గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి వివరించి మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే రానున్న మునుగోడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా B(T)RS పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ రమేష్ , నియోజకవర్గ B(T)RS నాయకుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by