మంచిర్యాల జిల్లా:- మందమర్రి పట్టణంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే మందమర్రి పట్టణంలోని యాపల్ ఏరియా సమీపంలో రహదారిపై లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో సురిమిల్ల నర్సయ్య అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

