మంచిర్యాల జిల్లా:- భీమారం మండలం లోని ఆరెపల్లిలో గ్రామం లో వనిత (20) సద్దుల బతుకమ్మ పండుగకు తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి శంకరయ్య, శంకరమ్మ దంపతులు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి కూతురు వనిత (20) ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. పండుగ కోసం కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడింది. ఐనా వారు మన ఆర్థిక స్తోమత ఇప్పుడు అంత బాలేదని మళ్లీ కొనిస్తానని వారు మందలించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది.

.jpeg)