మంచిర్యాల జిల్లా:- కాసిపేట మండలంలోని రేకులకుంట గూడ గ్రామానికి చెందిన భీమ్ రావు అనే వ్యక్తి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆటో ట్రాలీ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించిన వ్యక్తి మరణించడంతో కుటుంబ సభ్యులందరూ రోధిస్తున్నారు.

