DIGITAL MANCHERIAL NEWS:- భీమారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఇంటినే దోచేసిన దొంగలు. వివరాల్లోకి వెళితే గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో నివాసముంటున్న కానిస్టేబుల్ సదయ్య డ్యూటీకి వెళ్లగా, భార్య ఆసుపత్రికి వెళ్లగా ఇది గమనించిన దొంగలు వారు ఇంట్లో నుంచి వెళ్లగానే ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి 2తులాల బంగారు ఆభరణాలను తీసుకెళ్లినట్లు తెలియజేశారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

