మంచిర్యాల జిల్లా:- చెన్నూర్ నియోజకవర్గంలో ని కోటపల్లి మండలం లోని కొండంపేట గ్రామానికి చెందిన యువకుడిని ఆదుకున్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్. వివరాల్లోకి వెళితే...శ్రావణ్ కుమార్ అనే యువకుడికి ప్రమాదంలో కాలు పోవడంతో కృత్రిమ కాలు పెట్టించి గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ... డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి అని అదే కాలు పెట్టిస్తే వెల్డింగ్ పనిచేసే శ్రావణ్ తన సొంత కాళ్లతో పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడనే మందు చూపుతో సతీష్ 1లక్ష 80 వేల రూపాయల ఎల్ ఓసీ అందచేసి, కాలు పెట్టించాను అని తెలియజేశారు. ఈ సందర్భంగా యువకులు మాజీ ఎమ్మెల్సీ కి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

