PM దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాజీ ఎమ్మెల్సీ.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండల కేంద్రంలో గురువారం  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.... మునుగోడులో బిజెపి ఓడిపోతుందన్న భయంతోనే టిఆర్ఎస్ ను తట్టుకోలేక బీజేపీ నీతిమాలిన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మంత్రి సురేఖ రామయ్య, ఇతర టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by