డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు తక్షణమే విడుదల చేయాలి:PDSU.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గుువారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగాPDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు జేఎల్. శ్రీకాంత్ మాట్లాడుతూ.....తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థులు 4 సెమిస్టర్, 6 సెమిస్టర్ గత జూన్ నెలలో రాసినప్పటికీ ఐదు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇతర కోర్సులలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ సెమిస్టర్ ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు అనేక ఆందోళనలు చెందుతున్నారు. దీనిపై కేయూ విసి తక్షణమే స్పందించి 4 సెమిస్టర్, 6 సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని అదే విధంగా రివాల్యుయేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులని ఫలితాలు విడుదల వెంటనే విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని PDSU విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు డి.రాజ్ కుమార్, జె.విజయ్, ఏ. రాహుల్, డి.అనిల్ పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by