ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు BJP కుట్ర.
October 27, 2022
0
మంచిర్యాల జిల్లా:- మునుగోడు ఎన్నికలలో ఓడిపోతున్న భయంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) కుట్ర చేసిందని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించి కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పుతారన్న భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే ఇలాంటి కుట్ర మోసపూరితమైన పనులకు బిజెపి ఒడిగడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలను విచ్చిన్నం చేయాలని చూస్తున్న బిజెపి పార్టీకి రానున్న ఎలక్షన్ లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

