మంచిర్యాల జిల్లా:- తాండూర్ మండలంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం యంవీకే 3 గ్రామంలో మూసివేసిన బోగ్గు బావుల పరిసర ప్రాంతాల్లో అబ్బాపూర్ గని మేనేజర్ మహేష్ మరియు సింగరేణి అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సింగరేణి అధికారులతో మాట్లాడుతూ... సింగరేణి అధికారులు MVK ముంపు గ్రామాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన మేనేజర్ మహేష్ మాట్లాడుతూ మీ సమస్యల పరిష్కారానికి జిఎం తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామస్తులు బోరేం శివశంకర్, గొర్లపల్లి సురేష్, పెరుగు సంతోష్, ఎనగందుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



