మంచిర్యాల జిల్లా:- దండేపల్లి మండలం లోని కొండాపూర్ గ్రామం సర్పంచ్ దాసరి శాంతయ్య, మాజీ సర్పంచ్ ఇప్ప భూమన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు తెలియజేశారు. అలాగే కొండాపూర్ గ్రామంలె వివిధ పార్టీల నుంచి 150 మంది కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి జడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.


