మంచిర్యాల జిల్లా:- కాసిపేట మండల కేంద్రంలో భారీ కొండచిలువ కలకలం రేపుతుంది. గురువారం సాయంత్రం గ్రామంలో కి వచ్చిన భారీ కొండ సిలువ ను చూసి గ్రామస్తులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. దాదాపుగా ఐదు అడుగుల పొడవు ఉన్న కొండచిలువ గ్రామం లోకి రావడంతో గ్రామ ప్రజలు తామెప్పుడూ ఇంత పెద్ద కొండచిలువను చూడలేదని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టుకెళ్ళి అడవిలో విడిచి పెడతామని తెలియజేశారు.

