కోతిని మింగిన కొండచిలువ...!

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులోని గోదావరి తీరంలో కొండచిలువ కలకలం రేపింది. అలాగే పంటపోలాల దగ్గర కొండసిలువ కోతిని మింగేసినట్లు చూసిన రైతులు చెబుతున్నారు. పొలం పనుల నిమిత్తం వెళ్లిన ఓ రైతుకు చెట్టుపై గుంపులు గుంపులుగా కోతులు అరుస్తూ కనిపించాయి. దీంతో రైతులు వాటిని చెదరగొట్టే క్రమంలో అక్కడికి వెళ్లిన పలువురు రైతులకు కొండసిలువ కోతిని మింగుతున్న దృశ్యాలు రైతులకు కనిపించాయి.  స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం పెద్ద కోతిని కొండచిలువ మింగడంతో ఊపిరాడక అక్కడే మృతి చెందిందని స్థానికులు అంటున్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by