మంచిర్యాల జిల్లా:- జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను గురువారం రాత్రి పక్క సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. జైపూర్ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో వెళ్లి దాడి చేయగా 5 వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2, 550 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో తాటి సారయ్య, జక్కం తిరుపతి, వడ్లకొండ రాజ్యం, సజ్జన బాపు, ఎలకటూరి శంకర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ... ప్రభుత్వం నిషేధించిన పేకాట ఆడితే చట్టపరంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరగుతుంది అని తెలియజేశారు.

