తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవు: ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

బెల్లంపల్లి నియోజకవర్గం:- కన్నెపల్లి మండలానికి  చెందిన 27 మంది లబ్ధిదారులకు 27,03,132 రూపాయల కళ్యాణలక్ష్మి మరియు షాదీముభారఖ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలు తెలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు కెసిఆర్ కులమతాలతో సంబంధం లేకుండా ఏ పేద కుటుంబంలో ఆడపిల్ల వివాహం జరిగిన వివాహ కానుకగా కళ్యాణలక్ష్మి మరియు షాదీముభారఖ్ పేరుతో 1,00,116 రూపాయల ఆర్థికసహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సత్యనారాయణ, జనకాపూర్ ఎంపీటీసీ లతశ్రీ , మెట్ పల్లి, రెబ్బెన, వీరాపూర్ సర్పంచ్లు లక్ష్మీ, వెంకటేష్, అశోక్ గౌడ్, కన్నెపల్లి, నాయకన్ పేట మాజీ సర్పంచ్లు రాజయ్య, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ TRSY అధ్యక్షుడు మహేష్ గౌడ్, మండల TRS పార్టీ అధ్యక్షుడు రంగారావు, ముత్తాపూర్ గ్రామ TRS పార్టీ అధ్యక్షుడు రాజన్న, TRS నాయకులు, కార్యకర్తలు, ఎమ్మార్వో రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by