ఘనంగా కొమరం భీమ్ 82 వ వర్ధంతి వేడుకలు.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామ యాప చౌరస్తాలో తాటి గూడెం ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో ఆదివారo కొమరం భీమ్ 82 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాలతో పూజలు నిర్వహించి జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ రోడ్డ లక్ష్మి మాట్లాడుతూ... ఆదివాసీ హక్కుల కోసం ప్రాణాలర్పించిన కొమురం భీము స్ఫూర్తిగా తీసుకుని గిరిజన సంఘాలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడే జంగు, జిల్లా నాయకులు కురిసింగ హనుమంతు, మండల శాఖ అధ్యక్షుడు ఆత్రం జంగు, ఏకలవ్య నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు మడవి వెంకటేష్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by