మంచిర్యాల జిల్లా :- కాసిపేట మండల కేంద్రంలోని అశోక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది.భూ తగాదాలతో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లిలో నివాసం ఉంటున్న ఎముర్ల ఎల్లమ్మ (56) శనివారం కాసిపేట మండలంలోని అశోక్ నగర్ లోని పత్తి చేనును చూసేందుకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఎల్లమ్మను దారుణంగా నరికి చంపాడని మృతురాలి తల్లి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోద్ రావు, ఎస్ఐ గంగారాం తెలిపారు.

