మంచిర్యాల జిల్లా:- కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని నాయకపుగుడాలోని మంగ పూజిత (19) అనే మహిళకడుపు నొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది. ఈ నెల 8 తారీకున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పూజిత ఇన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. మృతురాలి యొక్క తండ్రి గంపల రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

