మంచిర్యాల జిల్లా:- కోటపల్లి మండలంలోని బబ్బెరు చెలుక గ్రామంలో తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామంలో ఒక వృద్ధురాలు మరణించగా ఆమె అంత్యక్రియలకు వెళ్లిన వారందరిపై తేనెటీగలు దాడి చేయడంతో దీంతో బొల్లంపెల్లి బాపు అనే వ్యక్తి నీ తీవ్రంగా కుట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు.


