మంచిర్యాల జిల్లా:- జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ అక్రమ బియ్యం వ్యాపారులకు అడ్డాగా మారిందని వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర కి బియ్యం తరలించడానికి అడ్డాగా మంచిర్యాల రైల్వే స్టేషన్ ని మార్చుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఆదివారం రోజు అక్రమ బియ్యం తరలిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేయగా వ్యాపారులు తీసుకోని వచ్చి రైల్లో ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా ఎస్సై సుధాకర్ తన బృందంతో కలిసి 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.


