జీఎంని కలిసిన ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- శ్రీరాంపూర్ పట్టణంలోని జీఎం కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు జీఎం తో సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ కార్యాలయం పున నిర్మాణం, ప్రారంభం అయిన సందర్భంగా జీఎంని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డర్ బ్యాక్లాగ్ పోస్టులు ఇంప్లిమెంటేషన్ కొరకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వంగూరి కెనడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజాన్ ఆఫీసర్, అధికారులు, ఏరియా నాయకులు, ఫిట్ కార్యదర్శులు ఇతరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by