విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలని సీపీ కి వినతి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలని శనివారం కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం చంద్రశేఖర్ రెడ్డి ని కలిసి  ట్రస్మా మంచిర్యాల జిల్లా సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా కేవలం మంచిర్యాల జిల్లాలోనే విద్యార్థి సంఘాలు పుట్టగొడుగుల్లా వెలిసి రోజు రోజుకు అరాచకాలు, విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువవుతున్నాయని, పాఠశాలలు సజావుగా జరుగకుండా అడ్డుపడుతున్నారని,  యాజమాన్యాలను వేదింపులకు గురిచేస్తున్నారని, కొంత మంది కుల విధ్యార్థి సంఘం పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ విద్యార్థి సంఘాల విషయంలో గత పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కు కూడా ఫిర్యాదు చేశామని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు సీపీ చంద్రశేఖర్ రెడ్డి కి వివరించారు. వెంటనే సీపీ సానుకూలంగా స్పందించారు. విద్యార్థి సంఘాలు పాఠశాలలకు వచ్చి యాజమాన్యాలను ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయమని, వెంటనే ACP, మంచిర్యాల తిరుపతి రెడ్డి కి ఫోన్ చేసి పాఠశాలలు సజావుగా నడువకుండా, చందాల గురించి యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేసే విద్యార్థి సంఘాలపై చర్య తీసుకోవాలని ఏసీపీ మంచిర్యాల కి సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కస్తూరి పద్మ చరణ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గోపతి సత్తయ్య, జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ పెంచాల శ్రీధర్, పట్టణ అధికార ప్రతినిధి జుల్ఫికర్ అహ్మద్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విక్రం రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by