రైతులను ఆదుకునే బాధ్యత ఎవరిది...!

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- నెన్నెల మండలంలో జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎస్కురి సలయ్య అనే రైతు పంట శనివారం రాత్రి అడవి పందుల దాడిలో పూర్తిగా ధ్వంసం అయింది. చేతికి వచ్చిన పంట ధ్వంసం కావడంతో నష్టపోయిన తనను అటవీశాఖ అధికారులు ఆదుకోవాలని కోరుకుంటున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వేసిన వరి పంటపై దాడి చేసి అడవి పందులు ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి మరీ పంట వేశానని తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు ఆదుకోవాలని కోరారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by