మంచిర్యాల జిల్లా:- శ్రీరాంపూర్ పట్టణ ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు నల్లా నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... మంచిర్యాల - శ్రీరాంపూర్ మార్గం లో గల రోడ్డు పూర్తిగా కరాబ్ బై అధ్వానంగా తయారైంది అని వచ్చి పోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం కొనసాగిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. అలాగే వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం రోడ్డు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు నయీమ్ పాషా, అర్. వంశీకృష్ణ, వి. సంతోష్, డి. విజయకాంత్ పాల్గొన్నారు.

