సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి.

D Prashanth Netha
0

మంచిర్యాల జిల్లా:- నేటి సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. శుక్రవారం సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలకు ఉన్న అపోహలను, సైబర్ నేరాలు నివారణ మార్గాలను, లోన్ యాప్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎవరైనాసైబర్ క్రైమ్ లో మోసపోతే వెంటనే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by