మంచిర్యాల జిల్లా:- దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి టాటా మ్యాజిక్ వాహన ఢీ కొనడంతో మృతి చెందాడు. లింగాపూర్ గ్రామానికి చెందిన కుర్సెంగ అశోక్ (42) నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అశోక్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు.

