DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పండుగ సందర్భంగా షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లలో వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...లాటరీ కూపన్ల కు ఆశ పడి వ్యక్తిగత వివరాలిచ్చి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని సూచించారు. ఒక వేళ మీ డబ్బు పోయినట్లు ఐతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయాలని, లేదా NCRP portal (www. cybercrime. gov. in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని తెలిపారు.

