చెన్నూరు నియోజకవర్గం:- మందమర్రి పట్టణంలోని CER క్లబ్ యందు శనివారం సాయంత్రం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొని, సంప్రదాయ బతుకమ్మ పాటలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం బహుమతులు కూడా ప్రదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.


