సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: సీపీ

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL:- సైబర్ నేరాల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లోన్ అప్లికేషన్ ద్వారా పొందే అప్పు అపాయం పొంచి ఉందని, అది ఎప్పుడయినా మీ పరువు, ప్రాణానికి నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. అపరిచితుల మాటలు నమ్మి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టవద్దని, అధిక లాభాల కోసం చూడవద్దని పేర్కొన్నారు. సైబర్ దొంగలు డబ్బును దోచేస్తే వెంటనే 1930 కి కాల్ చేయాలని, http: //www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు వెంటనే స్పందిస్తారని తెలియజేశారు. 



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by