మంచిర్యాల జిల్లా:- జైపూర్ మండలంలోని శెట్టిపెళ్ళి గ్రామ సర్పంచ్ మేడి రవికి గ్రామ పంచాయితీ సచివాలయం బార్ గా మారింది. గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యాలయంను అడ్డాగా మార్చుకొని తాగడం, తినడం చాలా బాధాకరం అని, అసలు ఇంత జరిగిన, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. సర్పంచ్ పై కలెక్టర్ వెంటనే వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.



