DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి, టీ జంక్షన్ల ఒంటి ప్రదేశాలలో వాహనాల తనిఖీలు పోలీసులు చేపట్టవద్దని ప్రజలు కోరుతున్నారు. టీ జంక్షన్ మూలమలుపు వద్ద ప్రమాదాలు ఇప్పటికే జరిగాయని, పోలీసులకు దొరకకుండా కొంతమంది తప్పించుకునే ప్రయత్నంలో వాహనాలు నడపడంతో ఇతర వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారులు స్పందించి ఇతర చోట తనిఖీలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

